Wednesday, 23 March 2011

Brahmins

బ్రాహ్మణులు గా జన్మించడం ఒక గొప్ప వరం. అందులోను తెలుగు దేశంలో తెలుగు ప్రాంతం లో జన్మించడం ఇంకా గొప్ప వరం. బ్రాహ్మణులు గా జన్మించినందుకు మనం కొన్ని తెలుసు కోవాలి. కొన్ని పాటించాలి. ముఖ్యంగా బ్రాహ్మణులు ఆచారాలను, సంప్రదాయాలను తాము పాటిస్తూ మిగిలిన వారికి తెలియచేస్తూ వాటిని ముందు తరాలవారికి అందిస్తూ మహోపకారం చేస్తున్నారు.

మనం కొన్ని తెలుసుకోవాలి. భౌతికవాదం పేరిట, సమాచార విప్లవం పేరిట జరుగుతున్న పనికిమాలిన ప్రచారాలను త్రిప్పికొట్టాలి. మూఢనమ్మకాలనుకునే వాళ్ళందరికీ మన ఆచారాలలో ఉన్న విశేషమైన విజ్ఞానాన్ని తెలియ చెప్పాలి.

ప్రతి పండుగలోను ఒక అందం ఉంది. ఒక విశేషం ఉంది. ఒక విజ్ఞానం ఉంది. ఒక కారణం ఉంది. ఒక సందేశం ఉంది.
అది తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇదంతా ఒట్టి చాదస్తపు ఛాందసవాదం అనటం ఎంత వరకు సబబు?

మిత్రులతో మాట్లాడుతున్నపుడు, తరచూ పత్రికల్లో రాస్తూన్నపుడు ఇలాంటి పలు అంశాలను ఒక బ్లాగ్ లో ఉంచితే మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు. సాంకేతిక నిరక్షరాస్యత వలన ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యింది.

నిత్య జీవితం లో మనకు తెలీకుండానే మనం ఆచరించే ఆచారాల్లో ఎన్నో విశేషాలున్నాయి. వాటినన్నింటిని నాకు తెలిసినంతలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.

మనం జరుపుకునే పండుగలు అన్నీ దండుగలు కాదు. వాటి పరమార్థం ఇదీ అని రుజువు చేసే ప్రయత్నం చేస్తాను.

భారతీయ సనాతన సంప్రదాయాలను, రుషులందించిన వైదిక ధర్మాచరణను పరిచయం చేస్తాను.

మనకు గోత్రములు అనేవి ఉన్నాయి. ఆ గోత్రములకు రుషులున్నారు. వారి పరంపరలోనే మనమంతా జన్మించాము. వారిని ప్రతి నిత్యం పూజించాలి. స్మరించుకోవాలి. తెలుగు బ్రాహ్మణుల ప్రవరల జాబితాను ఈ బ్లాగ్ లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాను.

ఇవి కాకుండా ఇంకా ఏదయినా మన బ్రాహ్మణుల కోసం ఉంటే బావుంటుందని మీకనిపిస్తే నాకు తెలియచెయ్యండి.
ప్రయత్న పూర్వకంగా కృషి చేస్తాను.

బ్రాహ్మణులంతా ఐకమత్యంగా ఉండాలనేది నా అభిలాష. అభిమతం. అంతకు మించి ఎలాంటి ఆశ లేదు.


నమస్సులతో
కొవ్వలి పద్మనాభ శర్మ

No comments:

Post a Comment